వనపర్తి జిల్లా పెబ్బేరు వద్ద భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను పోలీసులు అరెస్టు చేశారు. ఎల్లూరు లిఫ్టు పరిశీలనకు వెళ్తుండగా... పోలీసులు అడ్డుకున్నారు. పర్సెంటేజీల కోసమే కేఎల్ఐ వద్ద కేసీఆర్ నాసిరకం పనులు చేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే.. బయటపెట్టాలి: డీకే అరుణ - పెబ్బేరు వద్ద డీకే అరుణ అరెస్టు
ఎల్లూరు లిఫ్టును పరిశీలించేందుకు వెళ్తున్న భాజపా నాయకురాలు డీకే అరుణను... వనపర్తి జిల్లా పెబ్బేరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పనుల్లో అవినీతి బయటపడుతుందనే అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే.. బయటపెట్టాలి: డీకే అరుణ
అవినీతి బయటపడుతుందనే... ఎల్లూరు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే... అవినీతిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. డీకే అరుణ వెంట బంగారు శృతి, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఇదీ చూడండి:కల్వకుర్తి ఎత్తిపోతల వద్ద ఉద్రిక్తత... రేవంత్ రెడ్డికి గాయం
Last Updated : Oct 17, 2020, 3:45 PM IST