కుటుంబ కలహాలతో బావిలో దూకి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వనపర్తి జిల్లా అమరచింత మండలం కిష్టంపల్లి గ్రామంలో చిన్నపాగుల రంగన్నకు కుమారులు సంజీవ్(23), రమేష్(19), కుమార్తె జ్యోతి (16) ఉన్నారు. జ్యోతి చరవాణిలో మాట్లాడుతుండగా అన్న రమేష్ జ్యోతిని అస్తమానం ఫోన్లో ఎందుకు మాట్లాడుతున్నావు అని తిట్టడంతో జ్యోతి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో ఆత్మహత్య చేసుకోవడానికి దూకింది. అది చూసిన ఇద్దరు అన్నదమ్ములు రమేష్, సంజీవ్ చెల్లెలిని కాపాడుదామని బావిలో దూకగా ముగ్గురికి ఈత రాని కారణంగా ముగ్గురు బావిలో పడి చనిపోయారని తండ్రి చిన్నపాగుల రంగన్న తెలిపారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడంతో కుటుంబం నిండా విషాదయ ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలు: బావిలో పడి ముగ్గురి మృతి - died
సొంత అన్న 'ఫోన్లో ఎందుకు అంతసేపు మాట్లాడుతున్నావ్?' అని చెల్లెని మందలించాడు. దాంతో బావిలో ఆత్మహత్య చేసుకుందామని దూకింది. అది చూసిన అన్నదమ్ములు కాపాడేందుకు బావిలో దూకగా ముగ్గురికీ ఈత రాకపోవడంతో మృతి చెందారు. ఈ విషాద ఘటన వనపర్తి జిల్లా కిష్టంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
బావిలో పడి ముగ్గురి మృతి