తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆటో బోల్తా.. 20 మందికి గాయాలు - injury

ఆటో బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలైన ఘటన వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం మండలంలోని శాగపూర్​ స్టేజీ వద్ద చోటు చేసుకుంది.

ఆటో బోల్తా.. 20 మందికి గాయాలు

By

Published : Apr 29, 2019, 12:03 AM IST

ఆటో బోల్తా.. 20 మందికి గాయాలు

వనపర్తి జిల్లా ఖిలా ఘణపురం మండలం శాగపూర్ స్టేజీ వద్ద ఆటో బోల్తా పడి 20 మందికి గాయాలయ్యాయి. ఖిల్లా ఘణపురం మండలం కమాలుద్దీన్​పూర్​ నుంచి అదే మండలంలోని ఉప్పర్​పల్లి గ్రామంలోని తమ బంధువుల వివాహానికి వెళ్లి వస్తుండగా శాగాపూర్ స్టేజ్ వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఇందులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం మహబూబ్​నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అతివేగమే ప్రమాదానికి కారణమని పలువురు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details