వనపర్తి జిల్లాలోని దంతనూర్, దుప్పల్లి గ్రామాల్లో పాలమూరు తెరాస ఎంపీ అభ్యర్థి శ్రీనివాస రెడ్డికి మద్దతుగా దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే సీఎం కేసీఆర్ దిల్లీ స్థాయిలో ఉండాలన్నారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ కొత్తగా ఏం చేస్తారని విమర్శించారు. తమ అభ్యర్థి స్థానికుడని.. ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధికి కృషి చేస్తాడని హామీ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ దిల్లీ స్థాయిలో ఉండాలి: ఆల - CONGRESS
రాష్ట్ర పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ స్థాయిలో ఉండాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. 50 ఏళ్లు పాలించిన హస్తం కొత్తగా వెలగబెట్టేది ఏంటని ఎద్దేవా చేశారు.
ఆల వెంకటేశ్వర్ రెడ్డి
అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: 'రాజకీయరంగంలో అవినీతిని తగ్గించాం'