తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాంగ్రెస్ జలదీక్షకు మరో రోజు దొరకలేదా?'

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్​తో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు
వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు

By

Published : Jun 2, 2020, 4:56 PM IST

మహబూబ్ నగర్​ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధి మూసాపేట, అడ్డాకుల మండలంలోని పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్​తో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జానంపేటలోని 80 డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారు. రూ.కోటి యాభై లక్షల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ గోదాంను ప్రారంభించారు.

రూ.29 లక్షల వ్యయంతో జానంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మించనున్న అదనపు తరగతి గదులకూ శంకుస్థాపన చేశారు. మూసాపేట మండల కేంద్రంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న రెండు అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. 31 లక్షల వ్యయంతో నిర్మించిన మండల రిసోర్స్ కేంద్రాన్ని ప్రారంభించారు.

మరో రోజు దొరకలేదా ?

ఎన్నో పోరాటాలు.. అమరుల త్యాగాల ఫలితంగా వచ్చిన ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావించిన రోజున... దీక్షలు చేయడం ప్రజలను అవమానించడమేనని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. నిరసనలు, దీక్షలు చేయడానికి మరో రోజు దొరకలేదా అంటూ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆరేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన ఘనత తమ సర్కారుదేనని పేర్కొన్నారు. వ్యవసాయం, మిషన్ భగీరథ, ఐటీ, ఫార్మాసూటికల్, పరిశ్రమలు తదితర రంగాల్లో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు.

ఏడాదిలోపు నీళ్లు పారిస్తాం..

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్, వట్టెం, కరివెన జలాశయాల పనులు 75 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఏడాదిలోపు ఆయా ప్రాజెక్టుల నుంచి నీళ్లు పారిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి , రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్ ఉన్నారు.

ఇవీ చూడండి :కేసీఆర్​ ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదు: కోదండరాం

ABOUT THE AUTHOR

...view details