తెలంగాణ

telangana

ETV Bharat / state

కారు ఢీ కొని హెడ్​కానిస్టేబుల్ మృతి

వనపర్తి జిల్లా కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి పురఎన్నికల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న సలీమ్ ఖాన్​ అనే హెడ్​కానిస్టేబుల్​ను కారు ఢీ కొట్టింది. ఆసుపత్రికి తరలించేలోపే అతడు మరణించాడు.

accident vehicle checking constable in Wanaparthy district
కారు ఢీ కొని హెడ్​కానిస్టేబుల్ మృతి

By

Published : Jan 14, 2020, 10:14 PM IST

పురపాలక ఎన్నికలలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట వద్ద సోమవారం రాత్రి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో పెబ్బేర్ నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు తనిఖీలు నిర్వహిస్తున్న హెడ్​ కానిస్టేబుల్ సలీమ్ ఖాన్​ను ఢీకొట్టింది. క్షతగాత్రుని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.

ఘటనా స్థలం నుంచి కారు నడిపిన వ్యక్తి తప్పించుకున్నాడు. కారు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అపూర్వ రావు ఆసుపత్రికి వచ్చి హెడ్ కానిస్టేబుల్ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

కారు ఢీ కొని హెడ్​కానిస్టేబుల్ మృతి కారు ఢీ కొని హెడ్​కానిస్టేబుల్ మృతి

ఇవీ చూడండి;బస్తీమే సవాల్: మున్సిపల్​ వార్​లో యువత బస్తీమే సవాల్

ABOUT THE AUTHOR

...view details