తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

44వ జాతీయ రహదారిపై రెండు వేర్వేరు చోట్లలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

By

Published : Apr 28, 2019, 6:00 PM IST

రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కర్నూల్​కు చెందిన తండ్రి, కుమారులు మౌలాలి, రజాక్​లు కారులో హైదరాబాద్ వెళ్తుండగా వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెలటూర్ సమీపంలోకి రాగానే వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రహదారి కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తండ్రి మౌలాలి అక్కడిక్కడే మృతి చెందగా , కుమారుడికి తీవ్ర గాయాలు కావడం వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

మరో ప్రమాదం..

మహబూబ్​నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలో ఉన్న ప్లై ఓవర్​పై బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కారులో ఇరుక్కున్న మృతదేహాన్ని పోలీసులు అతికష్టం మీద బయటకు తీశారు. రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి: రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్ల మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details