తెలంగాణ

telangana

ETV Bharat / state

తేనెటీగల దాడిలో ఆరుగురికి తీవ్ర గాయాలు - 108 VEHICLE TO GOVERNMENT HOSPITAL

తేనెటీగలు ఆకస్మికంగా దాడి చేసి ఆరుగురిని తీవ్రంగా గాయపరిచాయి. చెట్టు మీద తేనేటీగల గుంపును గ్రహించక వంట కోసం పెట్టిన నిప్పుతో వాటికి పొగ సోకింది. ఒక్కసారిగా అక్కడున్న జనాలపై విరుచుకుపడ్డాయి.

గాయపడిన ఆరుగురు కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

By

Published : Mar 30, 2019, 3:28 PM IST

పొగ సోకి ఒక్కసారిగా జనాలపై విరుచుకుపడిన తేనెటీగలు
వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలో తేనెటీగలు దాడి చేశాయి. చిన్నంబావిలోని ఓ చెట్టు కింద నివాసం ఉండే చిరు వ్యాపారులు వంట కోసం కట్టెల పొయ్యి ముట్టించారు. చెట్టు కొమ్మకు ఉన్న ఈ ఈగల గుంపునకు పోగ సోకింది.ఒక్కసారిగా తేనెటీగలు దాడికి దిగాయి. అక్కడున్నవారు భయాందోళనకు గురై పరుగులు తీశారు. తేనెటీగల దాడిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. 108 వాహనంలో కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details