కరోనా బారినపడిన వారు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని... వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ తెలిపారు. సబితా ఆనంద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోమిన్ పేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఐసొలేషన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. చికిత్స పొందుతున్న కరోనా బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో పౌష్టిక ఆహారం, వారికి వినోదం కోసం ప్రత్యేకంగా టీవీ ఏర్పాటు చేశామన్నారు.
కరోనా బాధితులు ధైర్యంగా ఉండాలి: ఎమ్మెల్యే ఆనంద్ - Vikarabad latest news
వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండల కేంద్రంలో సబితా ఆనంద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఐసొలేషన్ కేంద్రాన్ని... ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సందర్శించారు. చికిత్స పొందుతున్న కరోనా బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఐసోలేషన్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కరోనా బారిన పడి ఇంట్లో ఐసొలేషన్ కోసం ఇబ్బంది ఉన్న ప్రతి ఒక్కరూ... ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిత్యం వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించటానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. కేంద్రంలో చికిత్స పొందుతున్న వారికి ఆక్సిజన్ అవసరం పడితే... స్థానికంగా అందుబాటులో ఉన్న ఆస్పత్రికి పంపిస్తామని అన్నారు.
ఇదీ చదవండి: 90 ఏళ్ల వృద్ధురాలిని భుజాలపై మోసుకెళ్లిన పోలీసు