తెలంగాణ

telangana

ETV Bharat / state

వికారాబాద్​ జిల్లా కలెక్టర్​ సస్పెండ్​ - rangareddy

వికారాబాద్ జిల్లా కలెక్టర్​పై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల పిటిషన్ దాఖలైనప్పటికీ ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను తెరిచినందుకు సస్పెండ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

వికారాబాద్​ కలెక్టర్​ సస్పెండ్​

By

Published : Feb 9, 2019, 8:50 PM IST

శాసనసభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ వికారాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రసాద్​కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల పిటిషన్ దాఖలైతే సంబంధిత నియోజకవర్గ ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను తెరవకూడదు. వికారాబాద్ జిల్లా కలెక్టర్​ నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను తెరిచారని కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధానాధికారి జ్యోతి బుద్ధ ప్రకాష్ నేతృత్వంలోని బృందం వికారాబాద్ వెళ్లి విచారణ జరిపింది. ఆరోపణలు రుజువు కావడంతో నిబంధనలు ఉల్లంఘించిన కలెక్టర్ ఒమర్ జలీల్​ను సస్పెండ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణ జరపాలని ఈసీ స్పష్టం చేసింది.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్​ లోకేశ్​కుమార్​కు తాత్కాలికంగా వికారాబాద్​ కలెక్టర్​గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details