మున్సిపల్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం.. - Vikarabad Collector Pausumi Basu
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో అడగడుగునా చెత్తాచెదారాలు, వ్యర్థాలతో నిండిపోయి వీధులు కనిపించటం వల్ల కలెక్టర్ పౌసుమి బసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మెరుగుపర్చుకోకపోతే ఇంటికి పంపించేస్తానని హెచ్చరించారు.
మున్సిపల్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం..
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో పారిశుద్ధ్య పనులను జిల్లా కలెక్టర్ పౌసుమి బసు పరిశీలించారు. పలు కాలనీల్లో పర్యటించి పారిశుద్ధ్య లోపాలపై అధికారులను నిలదీశారు. కాలనీలో డ్రైనేజీలను దగ్గరుండి తీయించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని కాలనీలను పారిశుద్ధ్యంగా ఉంచుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. అనంతరం పరిగి మండలం ఖదావన్పూర్ గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.