తెలంగాణ

telangana

ETV Bharat / state

'హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టాలి.. ప్రతిమొక్కనూ బతికించాలి'

వికారాబాద్ జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమైన సందర్భంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు పెద్ద ఎత్తున నాటాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

వర్షాకాలం వచ్చింది.. హరితహారాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి: మంత్రి కేటీఆర్
వర్షాకాలం వచ్చింది.. హరితహారాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి: మంత్రి కేటీఆర్

By

Published : Jun 15, 2020, 10:56 PM IST

వికారాబాద్ జిల్లాలోని పురపాలికలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్​లో సమీక్ష నిర్వహించారు. ఆయా పురపాలికల అభివృద్ధిపై చర్చించారు. గత వారం కోస్గి, కొడంగల్ పురపాలికలపైన సమావేశం నిర్వహించారు. సోమవారం వికారాబాద్, తాండూర్, పరిగి పట్టణాలపైన సమీక్ష చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పురపాలక పట్టణాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. వాటిని వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

పుర కమిషనర్లతో చర్చ..

మూడు పట్టణాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి స్థానిక పుర కమిషనర్లను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా పట్టణాల ఆదాయ వనరులు, ఖర్చు, భవిష్యత్​లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని జిల్లా ప్రజా ప్రతినిధులను మంత్రి కోరారు. మూడు పట్టణాల్లో పార్కులు, ఫుట్ పాత్​లు, రోడ్లు, టాయిలెట్ నిర్మాణం, స్మశాన వాటికలో అభివృద్ధి.. మొదలైన కార్యక్రమాల గురించి పలు సూచనలు చేశారు.

సమీక్షలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా ప్రజా ప్రతినిధులు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మూడు పట్టణాల మున్సిపల్ చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ మరియు పురపాలక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

ఇవీ చూడండి : నాటిన ప్రతి మెుక్కను కాపాడాలి : మంత్రి హరీశ్​

ABOUT THE AUTHOR

...view details