వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మాయమాటలు చెప్పి ఓ బాలికపై ఇద్దరు యువకులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక పరిగిలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుకుంటోంది. అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బాలికను కళాశాల వద్ద వదులుతామని చెప్పి... బైక్ పై ఎక్కించుకొని లక్నాపూర్ ప్రాజెక్టు సమీపంలోని పొలాల్లో అత్యాచారం చేశారు. అనంతరం పరిగి రూట్లో మరోసారి అత్యాచారం చేసి పరిగి బస్టాండ్ వద్ద వదిలేశారు.
బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం - rape attempt on minor girl
ఓ బాలికపై ఇద్దరు యువకులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన వికారాబాద్ జిల్లా సోమన్గుర్తిలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మైనర్ బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం
ఇంటికి వెళ్లిన బాలిక తన కుటుంబసభ్యులతో విషయం చెప్పగా... వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: జీవితం మీద విరక్తితో మహిళ ఆత్మహత్య