నిషేధిత గుట్కా వ్యాపారం చాటుమాటుగా జరుగుతోంది. కొందరు అక్రమార్కులు పోలీసుల కళ్లు గప్పి నిషేధిత గుట్కాలను ప్రజలకు అంటగడుతున్నారు. తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో పోలీసుల కళ్లు గప్పి కొందరు అక్రమార్కులు వికారాబాద్ జిల్లా తాండూర్‌కు గుట్కాను తరలించడానికి ప్రయత్నించారు.
గుట్కాను తరలిస్తున్న ముగ్గురి అరెస్టు - vikarabad district
వికారాబాద్ జిల్లా తాండూర్‌కు గుట్కాను తరలించడానికి యత్నించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 20 వేల విలువ చేసే గుట్కా పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు.
గుట్కాను తరలిస్తున్న ముగ్గురి అరెస్టు
సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని పట్టుకుని 20 వేల విలువ చేసే పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి: వలస కార్మికుల వాహనం బోల్తా..20మందికి గాయాలు, ఒకరు మృతి