వికారాబాద్ జిల్లా పూడూరు మండలం సోమన్గుర్తి సమీపంలో దారుణం చోటుచేసుకుంది. నేషనల్ హైవేను ఆనుకొని ఉన్న ఓ పొలంలో గుర్తు తెలియని మహిళ శవం (35) లభ్యమైంది. మృతదేహాన్ని గుర్తించకుండా దుండగులు నిప్పుపెట్టి తగులబెట్టారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
పొలంలో మహిళ దారుణహత్య.. మృతదేహాన్ని తగులబెట్టిన దుండగులు - వికారాబాద్ నేర వార్తలు
వికారాబాద్ జిల్లా సోమన్గుర్తి సమీపంలోని పొలంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మృతదేహాన్ని గుర్తుపట్టకుండా దుండగులు నిప్పుపెట్టి తగులబెట్టారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉండగా.. అసలు హత్యకు గల కారణాలేంటని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పొలంలో మహిళ దారుణహత్య.. మృతదేహాన్ని తగలబెట్టిన దుండగులు
మహిళపై కర్రతో దాడి చేసి, రాయితో మోది హత్యచేసి.. గుర్తించకుండా ఉండేందుకు తగులబెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ మృతదేహం వద్ద మద్యం బాటిళ్లు, రక్తపు మరకలతో ఉన్న కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్య గురైన మహిళ ఎవరు, హత్యకు గల కారణాలేంటనే అంశాలపై దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి :రాజ్ భవన్ వద్ద ఆందోళనకు కాంగ్రెస్ యత్నం.. నేతల అరెస్టు