వికారాబాద్ జిల్లాలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. దారూర్ మండలంలో కేరెళ్లి నుంచి నాగారం వరకు రూ.ఎనమిదిన్నర కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డు పనులకు ఆమె శ్రీకారం చుట్టారు. మోమిన్‌పేట్ మండలంలోని చంద్రాయన్పల్లి గ్రామంలో 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కేజీబీవీ భవనాన్ని ఎమ్మెల్యే ఆనంద్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు నందివాగు ప్రాజెక్టులో చేపలను వదిలారు.
విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట : సబితా ఇంద్రారెడ్డి
విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లాలో పర్యటించి... పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె శంకుస్థాపన చేశారు.
విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల సంఖ్యను పెంచి బాలికల విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెసిడెన్షియల్ విద్యా విధానాన్ని పటిష్ఠం చేయడం ద్వారా డ్రాపవుట్లు గణనీయంగా తగ్గాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజీత్ రెడ్డి తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.