భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి అర్బన్, గ్రామీణ జిల్లాల మీదుగా వికారాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది. ఏడో రోజు ప్రజా సంగ్రామ యాత్ర చిట్టెంపల్లి నుంచి ప్రారంభమైంది. వేలాది మంది కార్యకర్తలు, భాజపా అభిమానులు ఆయన వెంట నడిచారు. మధ్యాహ్నానికి మన్నెగుడకు చేరుకుని... బహిరంగ సభను నిర్వహించారు. అనంతరం మొదలైన పాదయాత్ర రాత్రి 8గంటల వరకు సాగింది. సాయంత్రానికి పట్టణానికి చేరుకున్న సంజయ్‌కు వికారాబాద్ పట్టణ మహిళా మోర్చా నేతలు పూర్ణకుంభంతో స్వాగతం పలికి హారతి ఇచ్చారు. అనంతరం సాయి డెంటల్ కళాశాలలో ఏర్పాటు చేసిన బసకు చేరుకున్నారు.
praja sangrama yatra : వికారాబాద్‌లో భాజపా ప్రజా సంగ్రామ యాత్ర - వికారాబాద్‌లో ఏడోరోజు ప్రజా సంగ్రామ యాత్ర
బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామయాత్ర ఏడో రోజు కొనసాగింది. వికారాబాద్ పట్టణ పరిధిలోని శ్రీ సాయి డెంటల్ కళాశాల ప్రాగంణంలో ఏర్పాటు చేసిన బసకు చేరుకున్నారు.
bandi
ఎనిమిదో రోజు పాదయాత్రలో భాగంగా శనివారం వికారాబాద్ సమీపంలోని డెంటల్ కళాశాల నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది. వికారాబాద్ టౌన్, బాబు జగ్జీవన్‌రావు విగ్రహాం మీదగా మందాన్ పల్లి వరకు 13 కిలో మీటర్ల మేర సాగనుంది. మధ్యాహ్నాం వికారాబాద్ పట్టణంలో జరిగే సభకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. రాత్రి మందాన్ పల్లిలో బస చేయనున్నారు.
ఇదీ చూడండి:BANDI SANJAY PADAYATRA: ఈటల రాజేందర్ గెలుపు ఖాయం: బండి