తెలంగాణ

telangana

ETV Bharat / state

వికారాబాద్​ జిల్లాలో బంద్​ ప్రశాంతం - rtc strike in telangana

ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన రాష్ట్ర బంద్ వికారాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. బంద్​కు  ఉపాధ్యాయ, రాజకీయ నాయకులు మద్దతు పలికారు.

పోలీసుల బందోబస్తు మధ్య బస్సు

By

Published : Oct 19, 2019, 8:00 PM IST

వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ బంద్​ ప్రశాంతంగా ముగిసింది. వికారాబాద్ బస్ డిపో వద్ద ఉదయం 4 గంటలకే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిపో వద్దుకు అఖిలపక్షం, ఆర్టీసీ నాయకులు చేరుకోగా వారిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు ఎస్కార్ట్​తో వస్తున్న శంకర్​పల్లి బస్​ను అందోళనకారులు అడ్డుకున్నారు.
తాండూరులో పోలీసుల బందోబస్తు మధ్య బస్సులు నడిపారు. బంద్​కు మద్దతుగా ఆందోళనకు దిగిన కాంగ్రెస్, భాజపా, తెజస, వామపక్ష పార్టీల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

వికారాబాద్​ జిల్లాలో బంద్​ ప్రశాంతం

ABOUT THE AUTHOR

...view details