వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్పల్లి, సయ్యద్మల్కాపూర్ గ్రామాల్లో మహిళలకు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి బతుకమ్మ చీరలను పంపిణి చేశారు. రాష్ట్రంలో ఆదాయం లేకున్నా ప్రజా సంక్షేమం ఆగడం లేదని ఆయన అన్నారు.
బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి
వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. బతుకమ్మ చీరల పంపిణీతో చేనేత కార్మికులకు ఉపాధి కూడా కలుగుతోందన్నారు.
బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి
ఈ ఏడాది 287 డిజైన్లతో ప్రభుత్వం చీరలు తయారు చేయించిందని తెలిపారు. బతుకమ్మ చీరల తయారీలో చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. కేవలం బతుకమ్మ పండుగకే కాకుండా క్రిస్మస్, రంజాన్ పండుగలకు కూడా చీరలను పంపిణీ చేస్తామని చెప్పారు.
ఇవీ చూడండి: భువనగిరి కోటకు క్రమంగా పెరుగుతున్న సందర్శకుల తాకిడి