తెలంగాణ

telangana

ETV Bharat / state

'వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం సంతోషకరం' - వికారాబాద్​ జిల్లా తాజా వార్త

శాసనసభలో కొత్త రెవెన్యూ చట్టాన్ని ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేస్తూ వికారాబాద్​ జిల్లా కులక్చర్ల మండల కేంద్రంలోని అంబేడ్కర్​ చౌరస్తా వద్ద కేసీఆర్​ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం రైతుల అభివృద్ధికై పాటుపడుతోందని జెడ్పీటీసీ రాందాస్​ నాయక్ వెల్లడించారు.

palabhishekam to the kcr photo at kulkacharla in vikarabad district
'వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం సంతోషకరం'

By

Published : Sep 9, 2020, 9:39 PM IST

వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం వల్ల రైతులు సంతోష పడుతున్నారని.. అన్నదాతల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని పలువురు తెరాస నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తూ వికారాబాద్​ జిల్లా కులక్చర్లలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్​ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ సత్యహరి చందర్​, జెడ్పీటీసీ రాందాస్​ నాయక్​, వైస్​ ఎంపీపీ రాజశేఖర్​ గౌడ్​, తదితర నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కార్పొరేట్ ఆస్పత్రుల దందా అరికడతాం: కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details