వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, వారు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ మనోహర్ రెడ్డితో కలిసి కుల్కచర్ల, నవాబ్ పేట్, మల్కాపూర్ గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.
'మీ వద్దకు వచ్చే ధాన్యం కొనుగోలు చేస్తాం'
ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి ప్రారంభించారు.
గ్రాామాలకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు
అన్నదాతల సహాయార్థం గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అన్నారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని వెల్లడించారు. ఈ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.