తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజలకు పథకాలు శాశ్వతంగా గుర్తుండిపోతాయి' - తెలంగాణ వార్తలు

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రైతు వేదిక భవనాలను, నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. రైతు కష్టం తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్​ అని.. అందుకే రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి కొనియాడారు.

Minister Sabita Indra reddy visited Parigi constituency in Vikarabad district
'ప్రజలకు పథకాలు శాశ్వతంగా గుర్తుండిపోతాయి'

By

Published : Dec 24, 2020, 4:36 PM IST

ప్రజలకు శాశ్వతంగా గుర్తుండిపోయే అభివృద్ధి పథకాలెన్నో సీఎం కేసీఆర్ చేపడుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. పూడూరు, దోమ మండల కేంద్రాల్లో రైతు వేదిక నూతన భవనాలను ఎమ్మెల్యే మహేశ్​రెడ్డి, ఎంపీ రంజిత్​రెడ్డితో కలిసి ప్రారంభించారు. నస్కల్, పూడూరు గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.

రైతు కష్టం తెలిసిన వ్యక్తి సీఎంగా ఉండడం వల్లే.. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. రైతులను సంఘటితం చేసి వారిలో భరోసా నింపారని.. వ్యవసాయ అధికారులు భాద్యతతో పనిచేయడానికి ప్రభుత్వం రైతు వేదికలు నిర్మించిందని తెలిపారు. కేంద్రం తెచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలతో రైతులు నష్టపోతారన్నారు.

ఇదీ చూడండి:యాసిడ్ దాడి బాధితురాలికి భాజపా రాష్ట్రనేత పరామర్శ

ABOUT THE AUTHOR

...view details