ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎస్సీలను అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయి' - తెలంగాణ వార్తలు

ఎస్సీలను అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జనాభాలో అతి తక్కువ సంఖ్య ఉన్న అగ్రవర్ణాల వారు ఎస్సీల ఓట్లతో అధికారాన్ని అనుభవిస్తున్నారని అన్నారు.

manda-krishna-madiga-participated-in-mrps-meeting-at-tandoor-in-vikarabad-district
'ఎస్సీలను అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయి'
author img

By

Published : Jan 22, 2021, 11:05 AM IST

ఎస్సీలను అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై చివరికి ఎమ్మార్పీఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు ఇస్తూ... మోసం చేస్తున్నాయని విమర్శించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

జనాభాలో అతి తక్కువ సంఖ్య ఉన్న అగ్రవర్ణాల వారు ఎస్సీల ఓట్లతో అధికారాన్ని అనుభవిస్తున్నారని అన్నారు. అత్యధిక జనాభా ఉన్న ఎస్సీలు మాత్రం ఓటర్లుగానే మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రవర్ణాలకు చెందిన రాజకీయ పార్టీల్లో ఇచ్చే డబ్బు, మద్యానికి అమ్ముడుపోకుండా ఉండాలని కోరారు. రాజకీయంగా తనకు అండగా ఉంటే రాష్ట్రంలో తామూ అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:గీతే కదా అని దాటితే.. ప్రీమియం ప్రియం అవ్వొచ్చు.!

ABOUT THE AUTHOR

author-img

...view details