తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు వ్యథ: ఖర్చులు భరించలేక పంటను వదిలేశాడు! - వికారాబాద్‌ జిల్లా తాజా వార్తలు

ప్రస్తుతం నష్టాన్ని మూటగట్టుకుంటే తప్ప టమాటా పంటను రైతు మార్కెట్‌కు తేలేని పరిస్థితి నెలకొంది. రైతు విక్రయ ధర కిలో రూ.10 లోపే ఉండగా.. కోత, రవాణా ఇతర ఖర్చులతో అన్నదాతలకు నష్టాలే మిగులుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఓ రైతు తన పంటను పొలంలోనే వదిలేశాడు.

losses to farmers for tomato crop in Vikarabad district
నష్టాలే వస్తున్నాయని కోయలేక పొలంలోనే వదిలేశా

By

Published : Feb 16, 2021, 11:56 AM IST

ప్రస్తుతం టమాటాకు మార్కెట్‌లో రైతు విక్రయ ధర రూ.10 లోపే ఉంది. రైతు పండించిన పంటను మార్కెట్‌కు తేవడానికి... కోత ధర, రవాణా, కూలి, కమీషన్లు తదితర ఖర్చులు దాదాపుగా అంతే అవుతుండడంతో అన్నదాతలు విసిగిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం ఎత్‌రాజ్‌పల్లికి చెందిన రైతు మల్లారెడ్డి తన టమాటా పంటను పొలంలోనే వదిలేశారు. మార్కెట్‌కు తీసుకువెళితే ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు.

'రూ.35 వేలు వెచ్చించి అర ఎకరంలో టమాటా సాగు చేశా. పంటను రెండుసార్లు తీసి మార్కెట్‌కు తరలిస్తే రూ.10 వేలు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఖర్చులు కూడా రావడంలేదు. మార్కెట్‌కు తీసుకువెళ్లినా నష్టాలే వస్తున్నాయని కోయలేక పొలంలోనే వదిలేశా.'

ABOUT THE AUTHOR

...view details