తెలంగాణ

telangana

ETV Bharat / state

లారీనే లేని వ్యక్తికి.. లారీ రాంగ్ పార్కింగ్​ పేరుతో చలాన్ - వికారాబాద్​ జిల్లా వార్తలు

లారీ రాంగ్‌ పార్కింగ్‌ చేసి తప్పు చేసింది ఒకరైతే.. పోలీసులు విధించిన చలాన్‌ మరొకరికి వెళ్లిన ఘటన వికారాబాద్​ జిల్లా కొడంగల్​ పట్టంలో జరిగింది. లారీయే లేని తాను చలాన్​ ఎలా కడతానని హన్మంతు అన్నారు. మరి ఆ చలాన్​ ఎవరిదంటే..?

lorry  challan to wrong owner at kodangal
'నా దగ్గర లారీయే లేదు.. చలాన్‌ ఎలా కట్టేది!'

By

Published : Oct 10, 2020, 8:52 AM IST

గత నెల 26, 28 తేదీల్లో ఏపీ22యు0522 నంబరు గల లారీ బషీరాబాద్‌ రైల్వే స్టేషన్‌ రోడ్డుపై నిలిపారు. ఆ రెండు తేదీల్లో కలిపి రూ.270 జరినామా విధిస్తూ పోలీసులు పోస్టులో చలాన్‌ పంపించారు. కానీ అది లారీ ఓనరుకు కాకుండా కొడంగల్‌ పట్టణంలోని బాలాజీనగర్‌ కాలనీకి చెందిన హన్మంతు ఇంటికి వచ్చింది.

వాహన చలాన్​ను పరిశీలించగా.. లారీ నిలిపిన ఫొటోలు, చలాన్‌ కట్టాలని పోస్టులో ఉంది. తనకు లారీయే లేదని, లేనిదానికి డబ్బులు కట్టాలని రావడం విడ్డూరంగా ఉందని హన్మంతు తెలిపారు. వెంటనే కొడంగల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి వివరించగా.. చిరునామా తప్పుగా నమోదు కావడం వల్ల వచ్చి ఉండవచ్చని పోలీసు సిబ్బంది తెలిపారు.

ఇదీ చదవండిఃనాలుగేళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details