కంచే చేను మేసింది అన్నట్టుంది... వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల అధికారుల తీరు. కరోనా విజృంభిస్తున్నా... నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులే ఇలా ఫొటోలకు ఫోజులిస్తున్నారు. ఉల్లంఘించింది ఎవరో కాదు.. తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్సై, పంచాయతీ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు.
కరోనా మమ్మల్నేం చేస్తది.. ఫొటో కావాలి మాకూ.. - కుల్కచర్ల మండల అధికారుల నిర్లక్ష్య ప్రవర్తన
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల అధికారులు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి.. గుంపులుగా ఫొటోలకు ఫోజులిస్తున్నారు. అవగాహన కల్పించాల్సిన వీరే ఇలా వ్యవహరించడంపై పలు విమర్శలు వస్తున్నాయి.
కరోనా మమ్మల్నే చేస్తది.. ఫొటో కావాలి మాకు
వలస కూలీలకు నిత్యావసర సరకులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. హాజరైన అధికారులు మాత్రం తమకేమీ నిబంధనలు వర్తించవన్నట్టు.. కరోనా తమనేమి చేయదన్నట్టు వ్యవహరించారు. సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నా అలాంటివేవీ పట్టించుకోకుండా ప్రజాప్రతినిధులతో కలిసి ఫొటోలు దిగుతున్నారు.
ఇదీ చూడండి: కరోనా అనుమానితులు క్వారంటైన్‌కు తరలింపు