తెలంగాణ

telangana

రాంప్రసాద్ హత్య కేసులో ముగిసిన నిందితుల కస్టడీ

రాంప్రసాద్​ హత్య కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి కోగంటి సత్యంతోపాటు ఎనిమిది మంది నిందితులను రిమాండ్​కు తరలించారు.

By

Published : Jul 22, 2019, 7:50 PM IST

Published : Jul 22, 2019, 7:50 PM IST

రాంప్రసాద్ హత్య కేసులో ముగిసిన దర్యాప్తు

రాంప్రసాద్ హత్య కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. ప్రధాన నిందితుడు కోగంటి సత్యంతో పాటు 8మందిని పోలీసులు ప్రశ్నించారు. మూడు రోజుల పాటు నిందితులను ప్రశ్నించిన పోలీసులు వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన విభేదాలే హత్యకు కారణమని తేల్చారు. రాంప్రసాద్​ను హత్య చేసేందుకు 30సార్లు రెక్కీ నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
వికారాబాద్​లో రాంప్రసాద్​కు చెందిన ఉక్కు పరిశ్రమతో పాటు... పంజాగుట్టలోని కార్యాలయం వద్ద నిందితులు రెక్కీ నిర్వహించారని తెలిపారు. పంజాగుట్టలోని కార్యాలయం అనువుగా ఉందని నిర్ధరించుకొని ఈ నెల 6న కత్తులతో దాడి చేసి హత్య చేశారు. హత్య కేసులో మొత్తం 11మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు... 9మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. హత్యలో వీరితో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు. హత్యలో ఎవరెవరి పాత్ర ఎంటనే విషయాలను పోలీసులు... నిందితులను అడిగి తెలుసుకున్నారు.

రాంప్రసాద్ హత్య కేసులో ముగిసిన నిందితుల కస్టడీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details