వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండంలో ఆవును తుపాకీతో కాల్చి చంపిన ఘటనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే ఆవును కొందరు దుండగులు సరదా కోసం తుపాకీతో కాల్చి చంపడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఘటన జరిగిన సమయంలో ఆవుతో పాటు, బర్రె ఉందని బుల్లెట్ ఆవుకు తగిలి, బర్రె గొంతు దగ్గర చర్మంలో దిగిందని బాధిత రైతు చెబుతున్నారు. బుల్లెట్ దొరికినా కూడా దొరకలేదని చెబుతున్నారని బాధిత రైతు ఆరోపించారు.
ఆవును తుపాకీతో కాల్చి చంపిన ఘటనపై హిందూ సంఘాల ఆగ్రహం - Cow killing incident latest news
ఆవును తుపాకీతో కాల్చి చంపిన ఘటనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు వెంటనే గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
వికారాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు సదానంద రెడ్డి స్థానికులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. రైతులకు జీవనోపాధైన ఆవులను అటవీప్రాంతంలో మేతకు వస్తే ఆటవిడుపుగా తుపాకీతో ఆవును చంపడం వంటి దుశ్చర్యలు చేయడం బాధాకరమని సదానంద రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు వెంటనే గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే హిందూ సంఘాలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. తమ పశువులను మేత కోసం అడవికి తీసుకెళ్లాలంటే భయంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:నిరాధార ఆరోపణలతో జడ్జిలపై లేఖ రాశారు: అశ్వినీకుమార్