తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇక్కడ రాడార్​ వద్దు... ప్రజల ప్రాణాలే ముఖ్యం'

వికారాబాద్​ పూడూర్​లో భారత నౌకా దళం ఏర్పాటు చేయనున్న నేవి రాడర్ వల్ల ప్రజా జీవనం అస్త్యవ్యస్తం అవుతుందన్నారు శాస్త్రవేత్త డా. సాయి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేయదలచిన సంబంధిత రాడార్​ను ప్రజా సంక్షేమం దృష్ట్యా వెంటనే ఇతర ప్రాంతానికి తరలించాలని కోరారు.​

'ప్రజా భద్రత దృష్ట్యా రాడార్​ను వేరే చోటుకి తరలించాలి'
'ప్రజా భద్రత దృష్ట్యా రాడార్​ను వేరే చోటుకి తరలించాలి'

By

Published : Jan 2, 2020, 9:17 PM IST

వికారాబాద్ జిల్లా పూడూర్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న నేవి రాడర్ వల్ల ప్రజల ప్రాణాలకు హాని ఉందని శాస్త్రవేత్త డా. సాయి భాస్కర్ రెడ్డి అన్నారు. ఎక్స్​ట్రీమ్​ ఫ్రీక్వెన్సీ వల్ల చుట్టు పక్కల గ్రామాలకు పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రజా వినాశానికి ఇది నాంది పలుకుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజా జీవనానికి ముప్పు తెచ్చే నేవీ రాడర్​ను ఇక్కడ పెట్టవద్దని హెచ్చరించారు. నేవి రాడర్ సిగ్నల్ చాలా వేగవంతంగా సుమారు లక్ష కిలోమీటర్ల వరకు వెళ్తుందని వెల్లడించారు. సముద్ర నీళ్ల అడుగు వరకు దాని సిగ్నల్​ వెళ్తుందని తెలిపారు. భూమిలోపలికి సైతం చొచ్చుకుపోతుందని అన్నారు. శక్తివంతమైన సిగ్నలింగ్ వ్యవస్థ కలిగిన ఈ రాడార్​ వల్ల మనిషి మనుగడ సాధ్యం కాదన్నారు. హానికర తరంగాలు మనిషి శరీరంలోకి చొచ్చుకుపోయి క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులకు దారి తీస్తాయని శాస్త్ర వేత్త స్పష్టం చేశారు.

సుప్రీం కోర్టుతో సహా ...

దేశ భద్రతతో పాటు ప్రజల భవిష్యత్ కూడా ముఖ్యమేనని సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పురుషోత్తం రెడ్డి అన్నారు. సమీపంలోని విద్యార్థులతో నాలుగు వేల పోస్టల్ కార్డులు సుప్రీం కోర్టుకు, ప్రధాని, ముఖ్యమంత్రి, నౌకా దళ అధికారులకు లేఖల ద్వారా వినతి పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు యాదయ్య, సుప్రీం కోర్టు న్యాయవాది స్పందన తదితరులు పాల్గొన్నారు.

'ప్రజా భద్రత దృష్ట్యా రాడార్​ను వేరే చోటుకి తరలించాలి'

ఇవీ చూడండి : పెట్రోల్​ పోసుకోని కుటుంబం ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details