వికారాబాద్ జిల్లాలోని పరిగి, నస్కల్లో మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. మరికొన్ని చోట్ల పంటలు నీట మునిగాయి. కాలువలు, కుంటలు తెగి నస్కల్ గ్రామంలో ఎస్సీ కాలనీలోని ఇళ్లల్లోకి మురుగు నీరు ప్రవేశించింది.
వర్షాలతో ఇబ్బందులు... ఇళ్లల్లోకి వరద నీళ్లు
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లాలోని గ్రామాలు అతలాకుతలమవుతున్నాయి. చెరువులు, కుంటలు తెగిపోయాయి. వరద నీరు నేరుగా ఇళ్లలోకే ప్రవేశించి జనాలకు కునుకు లేకుండా చేస్తున్నాయి.
heavy rains in parigi and rain water entering in to houses
పరిగి నుంచి నస్కల్, వికారాబాద్ వెళ్లే దారి వరద నీటిలో మునిగిపోగా... రాకపోకలు నిలిచాయి. నస్కల్లో సైడ్ డ్రైనేజ్ లేక పోవటం వల్ల వరద నీరు నేరుగా ఇళ్లల్లోకి వస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా... పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సైడ్ డ్రైనేజీ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.