వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో కొవిడ్ బారిన పడిన వారికి తన వైద్య కళాశాలలో ఉచిత వైద్యం అందిస్తామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి చెప్పారు. పరిగి ప్రాంత ప్రజలు ఎవరూ అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు.
కరోనా సోకిన వారికి ఉచితంగా వైద్య సేవలు: రామ్మోహన్ రెడ్డి - వికారాబాద్ జిల్లా లేటెస్ట్ వార్తలు
పరిగి నియోజకవర్గంలో కొవిడ్ బారిన పడిన వారికి తన టీఆర్ఆర్ మెడికల్ కాలేజీలో ఉచితంగా వైద్యం అందిస్తామని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఎవరు అధైర్య పడొద్దని కోరారు.
కొవిడ్ బాధితులకు ఉచిత వైద్యం
కరోనా సోకిన వారి కోసం 300 పడకలతో ఆస్పత్రి ఏర్పాటు చేశామన్నారు. ఐసోలేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. నెగిటివ్ వచ్చేంత వరకు బాధితునికి ఉచిత వసతి, భోజనం అందిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి:కాన్పుర్‌లో కుప్పలు తెప్పలుగా మృతదేహాలు!