ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన షేక్ ఉస్మాన్... ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అతనికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. ఏడేళ్ల క్రితం ఉస్మాన్ రెండు కిడ్నీలు పాడయ్యాయి. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంపాదన లేకపోగా... అప్పులు చేసి, మిత్రులు, బంధువుల సాయంతో ఏడేళ్లు నెట్టుకొచ్చారు.
సాయం కోసం...
రెండు నెలల క్రితం ఉస్మాన్ పరిస్థితి విషమంగా మారడం వల్ల నిమ్స్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. కిడ్నీలు మార్చాల్సిందేనని డాక్టర్లు తేల్చి చెప్పారు. భార్య కిడ్నీ ఉస్మాన్‌కు సరిపోతుందని చెప్పారు. మూత్రపిండాలు మార్చడానికి 8 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పటంతో ... ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది ఉస్మాన్ కుటుంబం. దయగల ప్రభువులు ఎవరైనా తమను ఆదుకుంటారని ఈ కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది.
ఇవీ చూడండి: చూడలేని కంటిపాపలు.. ఆలోచించలేని మెదడు