తెలంగాణ

telangana

కర్ణాటక నుంచి తరలిస్తున్న 5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న 5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు సీజ్ చేశారు. రైతులు అనుమతిలేని షాపుల దగ్గర విత్తనాలు తీసుకుని మోసపోవద్దని ఎస్పీ నారాయణ తెలిపారు.

By

Published : Jun 9, 2021, 8:41 AM IST

Published : Jun 9, 2021, 8:41 AM IST

Fake seeds caught in kodangal
Fake seeds caught in kodangal

కర్ణాటక నుంచి కొడంగల్ ప్రాంతానికి తరలిస్తున్న 5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్ పోలీసు కార్యాలయ పరిధిలో చోటు చేసుకుంది. కర్ణాటకలోని గురు మెడికల్ ప్రాంతం నుంచి దాదాపు 5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్నట్లు తెలిపారు. పక్కా సమాచారం ప్రకారం రావులపల్లి గ్రామ సరిహద్దు వద్ద ఆటోలో తరలిస్తున్న విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నారాయణ వెల్లడించారు.

కొడంగల్ మండలంలోని అంగడి రాయచూరు గ్రామంలో తనిఖీలు చేయగా.. గ్రామానికి చెందిన చిన్న బాలప్ప దగ్గర నకిలీ పత్తి విత్తనాలు లభ్యమైనట్లు ఎస్పీ నారాయణ తెలిపారు. సౌమ్య నాయక్.. సీఐలు తనిఖీ చేసి సదరు వ్యక్తిని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.

మోసపోవద్దు..

రైతులు అనుమతిలేని షాపుల దగ్గర విత్తనాలు తీసుకుని మోసపోవద్దని ఎస్పీ నారాయణ తెలిపారు. గుర్తింపు పొందిన షాపుల్లో ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన సూచనలు ఉంటేనే కొనుగోలు చేయాలని తెలిపారు. అనుమతి లేని వ్యక్తుల దగ్గర ఇలాంటి విత్తనాలు తీసుకొని మోసపోవద్దని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్ కొడంగల్ సీఐ అప్పయ, ఎస్ఐ సౌమ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 19 జిల్లాల్లో నేడు డయాగ్నోస్టిక్‌ కేంద్రాల ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details