తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం: మంత్రి సబిత - సబితా ఇంద్రారెడ్డి వార్తలు

ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. ఎంపీ శ్రీనివాస్​ రెడ్డి, పట్నం నరేందర్​ రెడ్డితో కలిసి వికారాబాద్​ జిల్లా బొమ్మరాసిపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

education minister sabitha indra reddy tour in vikarabad district
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: సబితా

By

Published : Dec 21, 2020, 3:30 PM IST

వికారాబాద్​ జిల్లా బొమ్మరాసిపేట మండలంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పర్యటించారు. ఎంపీ శ్రీనివాస్​ రెడ్డి, పట్నం నరేందర్​ రెడ్డితో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. అన్నదాతలకు ఏ సమస్య వచ్చినా అధికారులు, సర్పంచులు వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

ఇదీ చదవండి:ఎన్​హెచ్​163ని జాతికి అంకితం చేసిన నితిన్ గడ్కరీ

ABOUT THE AUTHOR

...view details