మహమ్మారి మరింత వ్యాప్తి చెందే ప్రమాదమున్నందున.. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి శానిటైజర్ వాడాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సూచించారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో.. కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డీసీసీబీ ఛైర్మన్ మనోహర్‌రెడ్డి హాజరయ్యారు.
కుల్కచర్లలో.. కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రం ప్రారంభం - ఫ్రంట్ లైన్ వర్కర్లు
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో.. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.

కుల్కచర్లలో.. కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రం ప్రారంభం
లాక్డౌన్ సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్లు చేసిన సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల సంక్షేమం కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం వారందరికీ టీకాలు అందజేస్తుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రాందాస్ నాయక్, ఎంపీపీ సత్య హరిచంద్ర, వైస్ ఎంపీపీ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.