వికారాబాద్ జిల్లా బండ వెల్కిచర్ల గ్రామంలో నిర్వహిస్తోన్న శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలపై కరోనా ప్రభావం పడింది. ఏటా రెండుసార్లు జరిగే ఈ ఉత్సవాలు... ఈనెల 2న ప్రారంభమయ్యాయి. ఈసారి కొవిడ్ కారణంగా పెద్దగా భక్తులను అనుమతించలేదు. కేవలం ఆలయ సిబ్బంది, స్థానిక భక్తులకు మాత్రమే అనుమతించారు.
రామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలపై కరోనా ఎఫెక్ట్ - Telangana news
వికారాబాద్ జిల్లా బండ వెల్కిచర్ల శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. మహమ్మారి కారణంగా పెద్ద సంఖ్యలో భక్తులను అనుమతించడం లేదు. కొంతమందితో మాత్రమే ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
కరోనా ఎఫెక్ట్
ప్రతి సంవత్సరం ఉత్సవాలకు హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చేవారు. ఈ సంవత్సరం కేవలం కొంతమందితో మాత్రమే నిర్వహించారు. ఇక్కడ ప్రత్యేకతగా నిలిచే అగ్నిగుండం ప్రవేశానికి కేవలం స్థానికులకు మాత్రమే అవకాశం కల్పించారు. రేపటితో ఉత్సవాలు ముగియనున్నాయి.
ఇదీ చూడండి:త్వరలోనే హైదరాబాద్లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం: కేటీఆర్