ఇటీవలి కాలంలో బాగా వైరల్ అవుతున్న పాట బుల్లెట్టు బండి(Bullettu bandi). ఈ పాట మొదట యూట్యూబ్‌లో(youtube) విడుదలై మంచి ఆదరణ పొందింది. పెళ్లి కూతురు డ్యాన్స్ చేయడంతో ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆ పాట చిన్నాపెద్దా అని తేడా లేకుండా అందరినీ ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ విషయాన్ని గమనించిన వికారాబాద్ జిల్లా భోంరాస్పేట మండలం దుద్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు పండితులు సుధాకర్.... ఈ పాటతోనే విద్యార్థులను పాఠశాలలకు రప్పించాలని భావించారు.
Bullettu bandi: బుల్లెట్టు బండి క్రేజ్... డుగ్గు డుగ్గు బండి స్కూల్ వెర్షన్ 2.O - తెలంగాణ వార్తలు
సామాజిక మాధ్యమాల్లో బుల్లెట్టు బండి(Bullettu bandi) మేనియా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలుత యూట్యూబ్‌లో(youtube) విడుదలైన ఈ పాటకు మంచి ఆదరణ వచ్చింది. ఆ తర్వాత ఓ నవవధువు డ్యాన్స్‌తో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ పాట వింటే చాలు చిన్నా... పెద్దా తేడా లేకుండా స్టెప్పులేస్తారంటే అతిశయోక్తి కాదు. అయితే ఇదే ట్రెండ్‌ను ఓ తెలుగు ఉపాధ్యాయుడు క్యాచ్ చేశారు. అందరినీ ఆకర్షిస్తున్న సంగీతంతో డుగ్గు.. డుగ్గు పాఠశాల పాటను ఆలపించారు. ప్రస్తుతం ఆ పాట కూడా సోషల్ మీడియాలో(Social media) వైరల్‌గా(viral) మారింది.
బుల్లెట్టు బండి పాట సంగీతానికి అనుగుణంగా... పిల్లలు బడికి రావడానికి ప్రోత్సహించేలా లిరిక్స్ రచించారు. అంతేకాకుండా ఆ సంగీతానికి తగిన స్వరంతో పాటను ఆలపించారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతోమంది తమ ప్రతిభను కనబర్చుతారు. అయితే ట్రెండ్‌కు తగ్గట్టు... విద్యార్థులు బడికి హాజరవడాన్ని ప్రోత్సహించేలా ఈ తెలుగు ఉపాధ్యాయుడు చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది(viral song). సామాజిక మాధ్యమాల్లో(social media) హల్చల్ చేస్తోంది. డుగ్గు.. డుగ్గు... పాఠశాల పాటను మీరూ ఓసారి వినండి మరి..!
ఇదీ చదవండి:Rains In Hyderabad: తడిసిముద్దైన భాగ్యనగరం.. కాలనీలు జలమయం!