తెలంగాణ

telangana

ETV Bharat / state

వైభవోపేతం... భావిగి భద్రేశ్వర స్వామి రథోత్సవం - vikarabad

వికారాబాద్​ జిల్లా తాండూరులో కొలువై ఉన్న భావిగి భద్రేశ్వర స్వామి జాతరలో భాగంగా స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఉత్సవ మూర్తులను దర్శించుకున్నారు.

bhadreshwara

By

Published : Apr 28, 2019, 11:40 AM IST

వికారాబాద్​ జిల్లా తాండూరులో వెలసిన భావిగి భద్రేశ్వరస్వామి జాతర మహోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఏటా చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం నుంచి తొమ్మిది రోజులపాటు స్వామివారి జాతర నిర్వహించటం ఆనవాయితీ. వేడుకల్లో ప్రధానమైన ఘట్టాలు స్వామివారి రథోత్సవం, లంకా దహనం. శనివారం అర్ధరాత్రి స్వామివారి రథోత్సవం భక్తుల కోలాహలం మధ్య వైభవంగా జరిగింది. రథం ముందు కళాకారుల విన్యాసాలు ఆద్యంతం అలరించాయి.

రథం ముందు పూర్ణకుంభంతో మంగళహారతి ఇచ్చిన అనంతరం ఉత్సవ మూర్తులను రథంలో రుద్రేశ్వర ఆలయం నుంచి సమీపాన ఉన్న బసవన్న వరకూ భక్తులు రథాన్ని లాగారు. జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణం విద్యుద్దీపాల అలంకరణతో మెరిసిపోతోంది.

భారీ భద్రత

జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ నారాయణ ఆధ్వర్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్​ అధ్యక్షురాలు సునీత రెడ్డి, పురపాలక సంఘం అధ్యక్షురాలు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.

అంగరంగ వైభవంగా భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవం

ఇదీ చదవండి: ఘనంగా భద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాలు

ABOUT THE AUTHOR

...view details