HITS BED College Principal Fraud in Vikarabad: వికారాబాద్ జిల్లాలో పూడూరు మండలం ఎన్కెపల్లి సమీపంలోని హిట్స్ బీఎడ్ కాలేజీలో శిక్షణ పొందిన విద్యార్థులకి చేదు అనుభవం ఎదురైంది. నిత్యం ఏదొకటి నేర్చుకోవాలని అన్నందుకేమో.. ఈసారి వారు మోసం పోయమనే విషయాన్ని నేర్చుకున్నారు. అది నేర్పింది ఎవరో కాదు మరి.. ఆ కళాశాల ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే అందరికి ఆదర్శంగా ఉంటారని విని ఉంటారు.. కాని ఆ కళాశాల్లో మాత్రం సీన్ రివర్స్.. చివరికి విద్యార్థులే అతనిపై కేసు పెట్టే స్థాయికి వచ్చారు. అసలు ఏం జరిగిందంటే..
HITS BED Students Protest on College Principal : ఎన్కెపల్లి సమీపంలోని హిట్స్ బీఎడ్ కాలేజీలో వృత్తి విద్యా కోర్సు ముగించుకొని సర్టిఫికెట్ల(Certificates) కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో వారు కాలేజ్ ఫీజు చెల్లించలేదని తెలిసింది. దీంతో ఆ విద్యార్థులు షాక్ గురైయ్యారు. అప్పటి వరకు వారు కళాశాలకి కట్టిన ఫీజు రిసిప్ట్‌లను తీసుకొచ్చి.. కళాశాల యాజమాన్యానికి చూపించారు. దీంతో ఆ యాజమాన్యం వారి దగ్గర ఉన్న రికార్డులను తిరగేసింది.
Students Protest in NKPally BED College : కాలేజ్ రికార్డులను పరిశీలించి యాజమాన్యానికి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కళాశాల్లో ప్రిన్సిపల్ చేసిన బాగోతం బయట పడింది. అతను విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకుని ఫేక్ రిసిప్ట్‌లను ఇచ్చారని సిబ్బంది గుర్తించింది. దీంతో యాజమాన్యం ప్రిన్సిపల్(Principal)ని నిలదీయగా తాను చేసిన విషయాన్ని చెప్పాడు. ఫేక్ రిసిప్ట్‌ల ద్వారా సుమారు రూ.39 లక్షలు కుంభకోణం చేశారని కళాశాల సిబ్బంది గుర్తించారు. ఈ డబ్బులను ఎక్కడని కళాశాల యాజమాన్యం తనని నిలదీయగా.. కొంత సమయం కావాలని.. ఈలోపు నగదును చెల్లిస్తానని తెలిపాడు. అనంతరం కాలేజ్ నుంచి ప్రిన్సిపల్ ఉడాయించాడు.