వికారాబాద్ జిల్లాలో బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగు రోజులుగా జరుగుతున్న బతుకమ్మ పండుగ వేడుకలు వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో జోరుగా కొనసాగుతున్నాయి.
వికారాబాద్‌లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబురాలు - Vikarabaad News
తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ వేడుకలు వికారాబాద్ జిల్లాలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నాలుగు రోజుల కిందట ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గం జోరుగా సాగుతున్నాయి.
మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ సంబురాల్లో పాల్గొంటున్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సునీతా రెడ్డి ఎమ్మెల్యే ఆనంద్‌తో కలిసి.. బంటారంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. తాండూరు పట్టణంలో పలు ప్రాంతాల్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పురపాలక సంఘం అధ్యక్షురాలు తాటికొండ స్వప్న పాల్గొని మహిళలతో పాటు బతుకమ్మ ఆడారు. జిల్లాలోని పలు పట్టణాల్లో ప్రతిరోజు సాయంత్రం కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మను తయారుచేసి బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇదీ చూడండి :ప్రతి ఇంటికి రూ.10 వేల ఆర్థిక సాయం: సీఎం