తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రేమ కోసం హెచ్​ఆర్సీని ఆశ్రయించిన ప్రియుడు

ప్రేమ కోసం ప్రాణత్యాగం చేసిన వారు, యుద్ధాలు చేసిన వారి గురించి వినుంటాం... కానీ ఓ యువకుడి ప్రేయసి కోసం మతాన్నే మార్చుకున్నాడు. చివరకు ఆమె ప్రేమ దక్కకపోగా... తనపై హత్యాయత్నం జరిగిందని న్యాయంకోసం మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించాడు ఓ యువకుడు.

a young man complained to the hrc on his girl friend
ప్రేయసి మోసగించిందని హెచ్​ఆర్సీని ఆశ్రయించిన ప్రియుడు

By

Published : Jan 20, 2020, 11:23 PM IST

Updated : Jan 21, 2020, 6:22 AM IST

ప్రేమ కోసం హెచ్​ఆర్సీని ఆశ్రయించిన ప్రియుడు

ప్రేయసికోసం ఓ యువకుడు మతం మారాడు. మనసుపడ్డ మగువ కోసం 11 నెలల శిక్షణ తీసుకున్నాడు. తీరా పెళ్లి విషయం వచ్చేసరికి యువతి తరఫువారు మాట మార్చారు. తనకు న్యాయం చేయాలంటూ ఆ యువకుడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించాడు.

ప్రేమకు అడ్డంగా మారిన మతం

వికారాబాద్​కు చెందిన బొబ్బిలి భాస్కర్ అలియాస్ మహమ్మద్ అబ్దుల్ హునైన్... అదే ప్రాంతానికి చెందిన ఓ ముస్లిం యువతి ప్రేమించుకున్నారు. చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న వారిద్దరి స్నేహం ప్రేమగా మారింది. డిగ్రీ పూర్తి చేసిన తరవాత తమ ప్రేమ విషయాన్ని ఇరుపెద్దల ముందు ఉంచారు. వీరిద్దరు మతాలు వేరవడం వల్ల యువతి తరఫువారు పెళ్లికి నిరాకరించారు.

అప్పుడు సరే అన్నారు.. ఇప్పుడు...

వేరే​ మతానికి చెందిన భాస్కర్​ను మత మార్పిడి చేసుకుంటే వివాహానికి ఒప్పుకుంటామని షరతు పెట్టారు. ప్రేయసి కోసం దిల్లీలో 11 నెలల శిక్షణ తీసుకుని ఆ యువకుడు ఇస్లాంమత మార్పిడి చేసుకున్నాడు. తాండూరులోని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మత ధ్రువీకరణ పత్రాన్ని పొందాడు. అనంతరం యువతి ఇంటికెళ్లి పెళ్లి విషయం ఎత్తగా వారు ముఖం చాటేశారంటూ వాపోతున్నాడు. యువతి కుటుంబ సభ్యులు తనపై దాడికి యత్నించారంటూ ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ బాధితుడి న్యాయం కోసం మానవహక్కుల కమిషన్​ను ఆశ్రయించాడు.

ప్రేమించిన యువతితో వివాహం జరిపించేలా చర్యలు తీసుకొని, వారిద్దరికి ప్రాణ రక్షణ కల్పించాలని మహమ్మద్ అబ్దుల్... హెచ్​ఆర్సీని వేడుకున్నాడు.

ఇదీ చూడండి: సమత కేసు తీర్పుపై ప్రాసిక్యూషన్​, డిఫెన్స్​ న్యాయావాదులేమన్నారంటే..

Last Updated : Jan 21, 2020, 6:22 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details