తెలంగాణ

telangana

ETV Bharat / state

vaccine: పాత్రికేయులకు మాస్కులు, శానిటైజర్ అందజేత - Metpally letest news

అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పాత్రికేయులు వార్తలను సేకరించాలని లైన్స్ క్లబ్ అధ్యక్షుడు గంగుల మురళి సూచించారు. మెట్​పల్లిలో పాత్రికేయులకు మాస్కులు, శానిటైజర్లు, చేతి గ్లౌజులు పంపిణీ చేశారు.

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మాస్కుల అందజేత
Lions club met pally distribution

By

Published : May 28, 2021, 11:57 AM IST

పట్టణాల్లో, గ్రామాల్లో తిరుగుతూ వార్తలను సేకరించి ప్రజలకు తెలియ పరుస్తున్న పాత్రికేయులు కరోనా బారిన పడొద్దని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గంగుల మురళి అన్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో పాత్రికేయులకి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లు, చేతి గ్లౌజులు పంపిణీ చేశారు.

పాత్రికేయులు అన్ని జాగ్రత్తలతో వార్తలను సేకరించాలని ఆయన సూచించారు. ఇప్పటికే పోలీసులకు, పురపాలక సిబ్బందికి, పలు శాఖల అధికారులకు, వ్యాపారస్తులకు మాస్కులు, శానిటైజర్ లను అందించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కోశాధికారి ఇల్లెందుల శ్రీధర్, చంద్రశేఖర్ ,ఆల్ రౌండర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details