తెలంగాణ

telangana

ETV Bharat / state

అత్యాశకు పోయారు... గంజాయి అమ్ముతూ పోలీసులకు చిక్కారు - ganja selling latest news in suryapeta

సూర్యాపేట జిల్లా నల్లబండగూడెం శివారులో గంజాయి సరఫరా, కొనుగోలు చేస్తున్న నలుగురు యువకులను కోదాడ రూరల్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గంజాయిని ఆంధ్రప్రదేశ్​లో కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Younger men catches by policemen because selling Ganja
గంజాయి అమ్ముతూ పోలీసులకు చిక్కిన యువకులు

By

Published : Jun 24, 2020, 8:46 PM IST

సూర్యాపేట జిల్లా నల్లబండగూడెం గ్రామ శివారులో క్రయ, విక్రయాలు చేస్తున్న నలుగురు యువకులను కోదాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. వైరాకు చెందిన ఇద్దరు వ్యక్తులు సురేష్, రోషన్​లు... ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా గొడ్లగూడెం సంతలో రెండు కిలోల గంజాయి కోనుగోలు చేశారు. దానిని నల్లబండగూడెంకు చెందిన కమల్, వంశీకృష్ణలకు అమ్ముతుండగా ఆ నలుగురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించలనే ఉదేశ్యంతో... కిలో గంజాయి రూ. 2000 చొప్పున కొనుగోలు చేసి రూ.6000 అమ్ముతునట్లు నిందితులు పోలీసుల విచారణలో తెలిపారు. 3 చరవాణీలు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కోదాడ రూరల్ సీఐ శివరామిరెడ్డి పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని కోదాడ తహశీల్దార్ మహమ్మద్ అలీతో పంచనామా నిర్వహించి... కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details