తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి - సూర్యాపేటలో రోడ్డు ప్రమాదాలు

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామంలో చోటు చేసుకుంది. యువకుడి అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ​

Young Boy Dies in Road Accident in Suryapeta district
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

By

Published : May 26, 2020, 12:12 AM IST

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామానికి చెందిన సాయి కుమార్​ అనే యువకుడు మూడు రోజుల క్రితం హైదరాబాద్​ నుంచి స్వగ్రామానకి ద్విచక్రవాహనంపై పస్తుండగా ఫణిగిరి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.

చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. యువకుడి అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ​

ABOUT THE AUTHOR

...view details