సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పెద్ద చెరువులో గుర్రపుడెక్క ఆక్రమించడం వల్ల చెరువు నిండి అలుగుపారింది. ఈ కారణంగా కోదాడ అనంతగిరి రహదారిపైకి నీరు చేరి గంటల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి.
అలుగు పారిన చెరువు.. వాహనదారులకు ఇక్కట్లు - పెద్ద చెరువులో గుర్రపుడెక్కతో వాహనాదారులకు ఇబ్బందులు
కోదాడ పట్టణంలోని పెద్ద చెరువులో గుర్రపు డెక్క పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో చెరువు నిండి అలుగు పారింది. కోదాడ-అనంతగిరి రహదారిపైకి నీరు చేరి.. గంటలకొద్దీ ట్రాఫిక్ జాం అయ్యింది. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడకు చేరుకుని తొలగింపు చర్యలు చేపట్టారు.
అలుగుపారిన చెరువు.. వాహనదారులకు ఇక్కట్లు
విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, కోదాడ ఆర్డీఓ కిషోర్ కుమార్ చెరువు వద్దకు చేరుకుని చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించారు. రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు.
ఇదీ చూడండి :రాష్ట్రంలో కొత్తగా 1,554 కరోనా కేసులు.. 9 మంది మృతి