సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయలేదని.. రైతుబంధు పథకం పూర్తి స్థాయిలో అమలు కాలేదని ఆయన ఎద్దేవా చేశారు. రైతులకు అతి ముఖ్యమైన ఎరువుల ధరలు 20 శాతం పెంచి వారి నడ్డి విరుస్తున్నారన్నారు. హుజూర్నగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్సే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మేళ్లచెరువు మండలాన్ని ఎంపీ నిధుల ద్వారా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
"హుజూర్నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం" - nalgonda mp
మేళ్లచెరువులో ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హాజరయ్యారు. తెరాస సర్కారు అన్ని విధాలుగా వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు.
"హుజూర్నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం"