తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాంగ్రెస్​ కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది' - కాంగ్రెస్​ ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి

కాంగ్రెస్​ కార్యకర్తలను పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ ​రెడ్డి ఆరోపించారు. తెరాస ప్రభుత్వ హయాంలో తమ పార్టీ శ్రేణులపై దాడులు పెరిగాయని ధ్వజమెత్తారు. తాము రాజ్యాంగ బద్ధంగా నడుచుకుంటూ అక్రమ కేసులపై పోరాటం చేస్తామని తెలిపారు.

నల్గొండ ఎంపీ ఉత్తమ్​కుమార్​

By

Published : Jun 14, 2019, 11:45 PM IST

తెరాస ప్రభుత్వం కాంగ్రెస్​ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తోందని నల్గొండ ఎంపీ ఉత్తమ్​కుమార్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఇటీవల తమ్మారంలో హస్తం కార్యకర్తలపై బలమైన దాడులు జరిగాయని అన్నారు. గిరిజన వ్యక్తిని కొట్టి 40 రోజులైనా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. హుజూర్​నగర్​ నియోజకవర్గంలో కాంగ్రెస్​ శ్రేణులను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తామని పేర్కొన్నారు.

పోలీసులు కాంగ్రెస్​ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారన్నఎంపీ ఉత్తమ్​

ABOUT THE AUTHOR

...view details