సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని ఏడో వార్డులో టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.40 లక్షల ఎంపీ నిధులతోనే ఈ పనులు చేపట్టినట్లు ఆయన వివరించారు. అనంతరం హుజూర్ నగర్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సీసీ రోడ్ల నిర్మాణానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన - Uttam Kumar Reddy latest news
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో 40 లక్షల ఎంపీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సీసీ రోడ్ల నిర్మాణానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన
కరోనా మహమ్మారి దేశాన్ని వదిలి వెళ్లిపోయేవరకు ప్రజలెవరూ ఎక్కువగా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని తెలిపారు. ప్రజలందరూ మాస్కులు ధరిస్తూ... భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఒక్క కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు.