సూర్యాపేట జిల్లా కోదాడలో ఆర్టీసీ కార్మికులు శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని అడ్డుకున్నారు. సమ్మెలో భాగంగా ర్యాలీ నిర్వహిస్తున్న కార్మికులు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన గుత్తా వాహనశ్రేణికి అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయగా.. ఛైర్మన్ వాహనం దిగి కార్మికుల దగ్గరకు వచ్చారు. కార్మికులు తమ సమస్యలు విన్నవించుకొని... గుత్తాకు వినతిపత్రిం అందజేసి, అడ్డుతప్పుకున్నారు.
మండలి ఛైర్మన్ గుత్తాకు ఆర్టీసీ సమ్మె సెగ - tsrtc employes protest before council chairmen canvoy in kodad
శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని... ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. కోదాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన గుత్తా వాహనశ్రేణిని అడ్డగిస్తూ... రోడ్డుపై బైఠాయించారు.

మండలి ఛైర్మన్ గుత్తాకు ఆర్టీసీ సమ్మె సెగ