తెలంగాణ

telangana

ETV Bharat / state

సూర్యాపేటలో కదిలిన బస్సు చక్రాలు...

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచే బస్సులు రోడ్డెక్కాయి. కరోనా వైరస్​ వ్యాప్తి కారణంగా బస్సులో సీట్ల పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని సిబ్బందికి అధికారులు సూచించారు. ప్రయాణికుల రద్దీని బట్టి ఎక్కువ సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు.

TSRTC buses on the road after 57 days of lock down in Suryapeta District
సూర్యాపేటలో కదిలిన బస్సు చక్రాలు...

By

Published : May 19, 2020, 11:16 AM IST

లాక్​డౌన్ కారణంగా 58 రోజులుగా బస్సులు డిపోలకే పరిమితమవ్వగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిపోల నుంచి బస్సులు కదిలాయి. సూర్యాపేట జిల్లా కోదాడ బస్ డిపోలో మొత్తం 90 బస్సులు ఉండగా 56 బస్సులను నడిపిస్తున్నట్లు డిపో మేనేజర్ రాజీవ్ ప్రేమ్ కుమార్ తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు ఎప్పటికప్పుడు అందజేస్తున్నట్లు డిపో మేనేజర్ పేర్కొన్నారు.

సూర్యాపేట డిపోలో మొత్తం 110 బస్సులు ఉండగా 78 బస్సులను నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒక శ్రీశైలం మినహా అన్ని సర్వీసులో బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించారు. బస్సులో సీట్ల పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని సిబ్బందికి సూచించారు. సాయంత్రం 7 గంటల లోపు డిపోకు చేరుకోవాలని మార్గదర్శకాలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details